హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించే సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో HCA అసోసియేషన్ సభ్యులు సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. HCA ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలని లావు నాగేశ్వరరావుని అసోషియేషన్ సభ్యులు కోరారు.గత హెచ్‌సీఏ అధ్యక్షుడు చేసిన అరాచకాలను ఏకసభ్య కమిటీకి వివరిస్తామని తెలిపారు.
గతంలో సభ్యులను స్టేడియంలోనికి రానీయకుండా గేట్లకు తాళాలు వేసి అడ్డుకున్నారని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. స్టేడియం బయట టెంట్ వేసుకొని సమావేశం నిర్వహించుకున్నామని తెలిపారు. ఈ విషయాలన్నింటినీ కమిటీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. హెచ్‌సీఏకు ఎన్నికలు నిర్వహించాలని గుర్తించినందుకు సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈనెల 17న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్‌పై పలు ఆరోపణలు వస్తోన్నాయి. ఉప్పల్ మ్యాచ్‌లో జరిగిన తప్పిదాలతో, హెచ్‌సీఏ తలనొప్పులు మొదలయ్యాయి. అజహరుద్దీన్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.