ఓయో బుకింగ్స్ లో మొదటి స్థానంలో హైదరాబాద్

-

ప్రముఖ హాస్పిటాలిటీ టెక్‌ ప్లాట్‌ఫామ్ ఓయో గురించి తెలియని వారుండరు. సరసమైన ధరల్లో క్వాలిటీ సర్వీస్ను అందించడంతో ఓయోకు తక్కువ సమయంలో ఎక్కువ గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో ఓయో హోటల్ బుకింగ్స్‌లో హైదరాబాద్‌ మొదటి స్థానంలో నిలిచింది. దిల్లీ, బెంగళూరులను వెనక్కి నెట్టి టాప్లో నిలిచింది. ఈ జాబితో బెంగళూరు రెండో స్థానాన్ని సంపాదించింది.

ఓయో ట్రావెలోపీడియా-2023 పేరిట విడుదల చేసిన నివేదికలో రాష్ట్రాల వారీగా చూస్తే తొలి స్థానంలో ఉత్తర్‌ప్రదేశ్‌ , రెండో స్థానంలో మహారాష్ట్ర ఉన్నాయి. వరంగల్‌, గుంటూరు, గోరఖ్‌పుర్‌, దిఘా వంటి నగరాలు కూడా గతేడాది పోలిస్తే మెరుగైన వృద్ధిని నమోదు చేశాయని వెల్లడించింది. ఖాళీ సమయంలో ఎక్కువ మంది సందర్శించిన ప్రదేశాల్లో జైపుర్‌ అగ్రస్థానంలో ఉండగా, గోవా, మైసూర్‌, పుదుచ్చేరి ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఆధ్యాత్మిక ప్రదేశాల జాబితాలో పూరీ అగ్రస్థానంలో ఉండగా, అమృత్‌సర్‌, వారణాసి, హరిద్వార్‌ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

ఈ ఏడాదిలో సెప్టెంబర్‌ 30న అత్యధిక బుకింగ్స్‌ నమోదైనట్లు ఓయో నివేదిక వెల్లడించింది. అత్యధికంగా బుకింగ్స్‌ నమోదైన నెలగా మే నెల నిలవగా.. ఇతర లాంగ్‌ వీకెండ్‌లతో పోలిస్తే సెప్టెంబర్‌ 30- అక్టోబర్‌ 2 మధ్య లాంగ్‌ వీకెండ్‌ అత్యధిక బుకింగ్స్‌ జరిగినట్టు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news