హైదరాబాద్‌ ప్రజలకు హెచ్చరిక…తాగునీటి కోసమే నీళ్లు వాడాలి !

-

హైదరాబాద్‌ నగర ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది HMWSS బోర్డు (హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు). తాగునీటి కోసమే నీళ్లు వాడాలని వార్నింగ్‌ ఇచ్చింది. తాగునీటి కోసం కాకుండా ఇతర అవసరాల కోసం వాడితే చర్యలు తప్పవు అని ఓ ప్రకటన రిలీజ్‌ చేసింది HMWSS బోర్డు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ చేసే వాటర్ తాగునీటి అవసరాలకు తప్ప మరే ఇతర అవసరాలకు వినియోగించరాదని వార్నింగ్ ఇచ్చింది.

Hyderabad Metropolitan Water Supply and Sewerage Board

తాగునీటి అవసరాలకు కాకుండా ఇతర అవసరాలకు నీటిని ఉపయోగించినట్లయితే, వినియోగదారులు చట్టంలోని నిబంధనల ప్రకారం జరిమానాలు విధించడం లేదా ట్యాప్ డిస్‌కనెక్షన్ చేస్తామని HMWSS బోర్డ్ హెచ్చరిక జారీ చేసింది. ఇక హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు తాజాగా ప్రకటనతో హైదరాబాద్‌ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బెంగళూరు పరిస్థితే మాకు వచ్చిందని వాపోతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version