హైదరాబాద్ మహానగరంలో కాసేపట్లో మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నగరం అంతా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని అన్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. వర్షం అధికంగా కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు దానికి తగినట్టుగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని జిహెచ్ఎంసి అధికారులు సూచించారు.

కాగా గత మూడు రోజుల క్రితం హైదరాబాద్ మహానగరంలో విపరీతంగా వర్షం కురిసింది. దీంతో రోడ్లమీద వెళ్లే ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫ్రిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కావున ప్రజలు ఈరోజు వర్షం అధికంగా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ తో పాటు ఈరోజు తెలంగాణలోని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు సూచనలు జారీ చేశారు.