హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణ పై వేటు

-

తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించనుండటంతో అన్ని శాఖల్లో అధికారులను మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ కంటే ముందే కొంత మందిని తెలంగాణ ప్రభుత్వం మార్చగా.. ఎన్నికల కోడ్ వచ్చిన తరువా ఈసీ పలు మార్పులు చేసింది. అయితే తాజాగా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణ పై వేటు పడింది. నాలుగేళ్లు ఓఎస్డీ గా విధులు నిర్వహిస్తున్నారు. పదవీ విరమణ తరువాత ఓఎస్డీగా విధులు నిర్వహిస్తున్నారు. ఈసీ ఆదేశాలతోనే అధికారులు బదిలీ చేశారు.

అదేవిధంగా తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులను కూడా బదిలీ చేశారు. TSPSA జాయింట్ డైరెక్టర్ గా రంగనాథ్, TSPSA డిప్యూటీ డైరెక్టర్ గా రాజేంద్రప్రసాద్, సీఐడీ ఎస్పీగా శ్రీనివాస్ రెడ్డి, గ్రే హౌండ్స్ ఎస్పీగా వెంకటేశ్వర్లు, సౌత్ వెస్ట్ డీసీపీగా నితికాపంత్, సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా రోహిత్ రాజ్, ట్రాఫిక్ డీసీపీగా ఆర్.వెంకటేశ్వర్లు, పెద్దపల్లి డీసీపీగా సునీతా మోహన్ బదిలీ అయ్యారు. ఇంకా మరికొందరూ అధికారులను కూడా బదిలీ చేసే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news