హైదరాబాద్‌ నుంచి సింగపూర్‌కు నేరుగా తొలి విమాన సర్వీస్‌

-

సింగపూర్‌ వెళ్లాలనుకు పర్యాటకులకు గుడ్ న్యూస్. పర్యాటకుల కోసం సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ ప్రత్యేకంగా విమాన సేవలు అందిస్తోంది. హైదరాబాద్ నుంచి సింగపూర్​కు డైరెక్ట్​గా సౌకర్యవంతమైన, సుదూర విమాన ప్రయాణ సేవలను సింగపూర్ ఎయిర్​లైన్స్ అందిస్తోంది. ఈ సర్వీసుపై జీహెచ్‌ఐఏఎల్‌ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్​లోని శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు నేరుగా ప్రయాణించే తొలి విమాన సర్వీసు ఆదివారం ఉదయం 11.20 గంటలకు ప్రయాణికులతో బయల్దేరింది.

సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ వైడ్‌ బాడీ ఎయిర్‌ క్రాఫ్ట్‌ విమాన సేవలను అందుబాటులోకి తేవడం ద్వారా ప్రయాణికులు మెరుగైన కోచ్‌ అనుభూతిని పొందుతారని జీహెచ్‌ఐఏఎల్‌ అధికారులు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, దక్షిణ, మధ్య భారతదేశంలోని ప్రధాన నగరాల నుంచి విద్య, పర్యాటక, వ్యాపారాల కోసం హైదరాబాద్‌ కేంద్రంగా విదేశాలకు వెళ్తున్న విమాన ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని వెల్లడించారు. హైదరాబాద్‌ నుంచి సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాలను గత 20 ఏళ్లుగా నడుపుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌లో జీహెచ్‌ఐఏఎల్‌ అధికారులు, ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధులు సంయుక్తంగా కేక్‌ కట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version