అమెరికాలో హైదరాబాదీపై దాడి.. సాయం చేయాలని విద్యార్థి రిక్వెస్ట్

-

ఉన్నత విద్య, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లిన వారిపై ఇటీవల దాడులు పెరిగిపోయాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌ మజహిర్‌ అలీ అనే విద్యార్థిపై అమెరికాలోని షికాగోలో దాడి జరిగింది. దారి దోపిడీకి పాల్ప‌డిన న‌లుగురు దొంగలు అతని వద్ద ఉన్న సొమ్ము కోసం తీవ్రంగా కొట్టారు.

అయితే అతడు నివసిస్తున్న ప్రాంతంలోనే ఈ దాడి జరగడం గమనార్హం.  ప్లీజ్ హెల్ప్ చేయండి అంటూ ఓ వీడియోలో అత‌ను వేడుకోవడం కనిపిస్తోంది. త‌ల, ముక్కు, మూతి నుంచి ర‌క్తం కారుతుండ‌గా తీవ్ర గాయాలైన అతడు వీడియో రికార్డు చేస్తూ అందులో తనను ఆదుకోవాలని కోరాడు. ఆ వీడియోను నెట్టింట పోస్టు చేయడంతో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

సయ్యద్‌ మజహిర్‌ అలీ ఇండియన్‌ వెస్లియన్‌ యూనివర్సిటీలో ఐటీలో మాస్టర్స్‌ చేస్తుండగా.. తన భ‌ర్త‌ను ఆదుకోవాల‌ని అతడి భార్య ఫాతిమా రిజ్వీ కేంద్ర విదేశాంగ శాఖ‌ను కోరింది. ఆయ‌న‌కు మంచి చికిత్సను అందించాల‌ని మంత్రి జైశంక‌ర్‌ను కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version