16న తెలంగాణలో ఆటోల బంద్‌

-

తెలంగాణ రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు కీలక ప్రకటన చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆటో డ్రైవర్లు ఈనెల 16న ఆటోల బంద్ కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టిఏటియు ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య కోరారు.

Autos strike in Telangana on 16

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత 6గ్యారెంటీ హామీలలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన విషయం విధితమే. ఈ తరుణంలో మహాలక్ష్మీ పథకంలో భాగంగా డిసెంబర్ 09 నుంచి వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఇప్పటివరకు ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించే వారు ఇప్పుడు ఆర్టీసీ బస్సులకే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version