హైడ్రా యాక్షన్.. ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు

-

అక్రమ నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా నగరంలో దూసుకుపోతుంది. తాజాగా చెరువులలో నిర్మాణాలు చేపట్టిన వారి నుంచి అనుమతులు ఇచ్చిన వారిపై హైడ్రా బుల్డోజర్ దృష్టి సారించింది. అసలు ఆరుగురు అధికారులపై కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్ లో చెరువులు కట్టడాలకు అనుమతులు ఇచ్చిన ఆరుగురు అధికారులపై పోలీసులు క్రిమినల్ నమోదు చేసారు. 

హైదరాబాద్ సీపీ అవినాష్ మహంతి కేసులను నమోదు చేశారు. చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధామ్స్, బాచుపల్లి ఎమ్మార్వో పై కేసు నమోదు అయింది. అలాగే మేడ్చల్ మల్కాజ్ గిరి ల్యాండ్ రికార్డుల ప్రకారం.. హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్ పై కేసు నమోదు చేసారు. అదేవిధంగా హెచ్ఎండీఏ సిటీ ప్లానర్ రాజుకుమార్ పై, నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ పై కేసులు నమోదు చేసారు. హైడ్రా సిఫారసులతో ఆరుగురు అధికారులపై  కేసులు ఫైల్ చేశారు పోలీసులు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version