భారత జట్టు పాకిస్తాన్ కి రావద్దు.. పాక్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు

-

2025 ఫిబ్రవరిలో పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసిందే. అయితే భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడం క్రికెట్ సంబంధాలను చెడగొట్టింది. దీంతో దశాబ్ద కాలంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ లు జరగడం లేదు. అయితే ఈ ఐసీసీ మెగా ఈవెంట్ కోసం భారత జట్టు తమ దేశంలో పర్యటించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, ఆ దేశం మాజీ ఆటగాళ్లు కోరుకుంటున్నారు.

కానీ పాక్ లో పర్యటించాలా..? వద్దా..? అనే విషయంలో బీసీసీఐ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఈ విషయానికి సంబంధించి రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. మరోవైపు పాకిస్తాన్ మా దేశంలోకి భారత్ రావాల్సిందేనని గట్టిగా పట్టుబడుతుంది. అయితే తాజాగా ఈ విషయంలో పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా తమ దేశానికి భారత్ రావద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు.

పాకిస్తాన్ లో ప్రస్తుత భద్రతా పరిస్థితుల దృశ్య అన్ని దేశాల ఆటగాళ్లకు.. ముఖ్యంగా భారత ఆటగాళ్లకు భద్రత కల్పించడం చాలా ముఖ్యమని కనేరియా అభిప్రాయపడ్డారు. ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్ లో జరిగే అవకాశం ఉందని కనేరియా పేర్కొన్నారు. ఇదే కాకుండా టీమ్ ఇండియాకు సెక్యూరిటీ ఇచ్చే పరిస్థితిలో తాము ఉన్నామో, లేమో అనే విషయాన్ని పరిశీలించుకోవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version