మాదాపూర్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మాదాపూర్ లోని కావూరి హిల్స్ పార్కు స్థలంలో వెలసిన అక్రమ షెడ్లను తొలగించింది హైడ్రా సిబ్బంది. పార్కులో స్పోర్ట్స్ అకాడమి పై గత కొంతకాలంగా కావురి హిల్స్ అసోసియేషన్ హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. ఇక ఈ ఫిర్యాదు ఆధారంగా స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణాలను తొలగించారు హైడ్రా అధికారులు.

ఈ నిర్మాణాలను తొలగించి కావురి హిల్స్ పార్క్ అని బోర్డు ఏర్పాటు చేశారు హైడ్రా అధికారులు. కావురి హిల్స్ అసోషియషన్ నుంచి 25 సంవత్సరాలు తమకు లీజు కు ఇవ్వడం జరిగిందని ఆరోపించారు స్పోర్ట్స్ అకాడమీ నిర్వహకులు. తమ గడువు ముగియక ముందే అన్యాయంగా నిర్మాణాలను తొలగిస్తూన్నరని స్పోర్ట్ అకాడమీ ఆరోపణలు చేస్తున్నారు. అటు కోర్టు ఆదేశాలతో తొలగించామని తెలిపారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.