పాతబస్తీలో హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని చాంద్రాయణ గుట్టలోని అక్బర్ నగర్‌లో షాపులను కూల్చేసింది హైడ్రా. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు జరిపారు హైడ్రా అధికారులు. ఏఈ తరుణంలోనే పోలీసులకు, పాతబస్తీ వాసులకు మధ్య తోపులాట జరిగింది.

హైడ్రా జేసీబీ ఎక్కి, జేసీబీ ముందు పడుకొని కూల్చివేతలను అడ్డుకున్నారు స్థానికులు. హైడ్రాకు, రంగనాథ్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేశారు ఎంఐఎం కార్పొరేటర్లు. నిరసనలు తెలిపిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు… అక్కడి నుంచి తీసుకెళ్లారు.