ఫిర్జాదిగూడలో హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి. మేడిపల్లి ఆర్ఏఆర్ కాలనీలోని సెజ్ స్కూల్‌లో హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి. హైదరాబాద్-వరంగల్ హైవే లింక్ రోడ్డును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు తొలగించారు. స్కూల్ యాజమాన్యం ఆక్రమణలపై ఫిర్యాదు చేశారు స్థానికులు.
అటు ఫిర్జాదిగూడలో హైడ్రా కూల్చివేతల సందర్భంగా ఓ వృద్ధుడు తిరగబడ్డాడు. ఫిర్జాదిగూడలో హైడ్రా కూల్చివేతల సందర్భంగా వర్షం ఉంది.. ఖాళీ చేయడానికి రెండు గంటలు కాస్త సమయం ఇవ్వాలని కోరారు. వినకుండా కూల్చేసారు హైడ్రా అధికారులు.
అయితే హైడ్రా సిబ్బంది అత్యుత్సాహంతో స్పృహకోల్పోయి కింద పడిపోయాడు వృద్ధుడు. పీర్జాదిగూడలో హైడ్రా కూల్చివేతల సందర్భంగా ఖాళీ చేయడానికి రెండు గంటలు సమయం ఇవ్వాలని మొరపెట్టుకుందుకు వృద్ధుడుని అరెస్ట్ చేసింది హైడ్రా సిబ్బంది.
అరెస్ట్ సమయంలో స్పృహకోల్పోయి కింద పడిపోయాడు వృద్ధుడు. దింతో అతన్ని ఆస్పత్రికి తరలించారు.