ఆ స్థలాలపై పడిన హైడ్రా కన్ను..!

-

వెంగ‌ళ‌రావు న‌గ‌ర్ లోని వివాద స్థ‌లాన్ని ప‌రిశీలించారు హైడ్రా క‌మిష‌న‌ర్‌. వెంగ‌ళ‌రావున‌గ‌ర్ – మోతీన‌గ‌ర్ మార్గంలో క‌బ్జాకు గురైంద‌ని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పార్కు స్థ‌లాన్ని పరిశీలించారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. న‌లంద స్కూల్‌కు చేరువ‌లో ఉన్న 9800 చ‌ద‌ర‌పు గ‌జాల స్థ‌లం పార్కుకోసం కేటాయించార‌ని.. దీనిని త‌మ‌దంటూ కొంత‌మంది ఆక్ర‌మించి ఉన్నార‌ని హైడ్రాకు ఫిర్యాదు చేసారు స్థానికులు.

అయితే స్థానికుల స‌మ‌క్షంలో రెవిన్యూ, GHMC తో కలిసి విచార‌ణ చేపట్టారు హైడ్రా అధికారులు. ఆ స్థలం త‌మ‌దంటే త‌మ‌దని ముందుకు వ‌చ్చిన వారి వ‌ద్ద ఉన్న ప‌త్రాల‌ను తీసుకుని వ‌స్తే విచారణ చేస్తామని చెప్పారు హైడ్రా కమిషనర్. పాత్రలతో వస్తే విచారణ చేసి అది పార్కు స్తలమా.. ప్రైవేటు స్థలమా అనేది నిర్ధారిస్తామ‌న్నారు కమిషనర్ రంగ‌నాథ్‌. అయితే అక్క‌డ ఉన్న ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించి జీహెచ్ఎంసీ స్థలమని బోర్డులు ఏర్పాటు చేయాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్‌ ను కోరారు స్థానికులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version