తెలంగాణ రాష్ట్రంలో మరోసారి విగ్రహాల ధ్వంసం ఇష్యూ తెరపైకి వచ్చింది. హనుమకొండలోని మహాదేశ్వర స్వామి ఆలయంలో విగ్రహాలు ధ్వంసం చేశారు. హనుమకొండలో మహాదేశ్వర స్వామి ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేశారు దుండగులు. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
కమలాపూర్ మండలం శనిగరంలో మహాదేశ్వర స్వామి దేవాలయంలో విగ్రహాలను ధ్వంసం చేశారు దుండగులు. నెల రోజుల క్రితం ఇదే గ్రామ రామాలయంలో పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లారు దుండగులు. అయితే.. ఈ సంఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కమలాపూర్ పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
హనుమకొండలో మహాదేశ్వర స్వామి ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులు
కమలాపూర్ మండలం శనిగరంలో మహాదేశ్వర స్వామి దేవాలయంలో విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులు
నెల రోజుల క్రితం ఇదే గ్రామ రామాలయంలో పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లిన దుండగులు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కమలాపూర్… pic.twitter.com/M00aNjPPOz
— BIG TV Breaking News (@bigtvtelugu) December 6, 2024