అదానీ టీషర్ట్ ధరిస్తే.. రాహుల్ ను పార్లమెంట్ లోకి అనుమతించారు – జగదీష్ రెడ్డి

-

శాసనసభ సమావేశాలు సజావుగా జరగకుండా చేయాలని పాలకపక్షం కుట్ర పన్నిందన్నారు మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాన ప్రతిపక్షం సభకు రాకుండా చేయాలని ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. శాసనసభ బయటే ప్రధాన ప్రతిపక్షమైన మమ్మల్ని అడ్డగించడం దారుణం అని.. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు.

మేము అదానీ – రేవంత్ ఉన్న టీషర్ట్ వేసుకుని సభకు పోతే తప్పేంటని ప్రశ్నించారు. మేము ఏ బట్టలు వేసుకుని రావాలనేది స్పీకర్ చెబుతారా..? అని ప్రశ్నించారు జగదీశ్ రెడ్డి. పార్లమెంటులో రోజూ రాహుల్.. అదానీ దుర్మార్గాల మీదనే మాట్లాడుతున్నాడని.. ఇక్కడ రేవంత్ – అదానీని వెనుకేసుకు వస్తున్నాడని ఆరోపించారు. అదానీకి తెలంగాణ సంపద దోచిపెట్టేందుకు రేవంత్ కుట్ర పన్నాడన్నారు జగదీష్ రెడ్డి.

రామన్న పేట సిమెంట్ ఫ్యాక్టరీ, లగచర్లలో పరిశ్రమలు అదానీ కోసమేనని అన్నారు. రాహుల్ కూడా అదానీ టీ షర్ట్ ధరిస్తే పార్లమెంటు లోకి అనుమతించారు.. కానీ ఇక్కడ ఎందుకు అనుమతించరని నిలదీశారు. రాహుల్ గాంధీనే తాము అనుసరించామన్నారు. ఉభయ సభలు రేవంత్ నడువుతున్నాడా..? స్పీకర్, కౌన్సిల్ చైర్మన్ నడుపుతున్నారా..? అని ప్రశ్నించారు జగదీశ్ రెడ్డి.

రాహుల్ ది ఒప్పు అయితే.. మేము చేసింది తప్పని స్పీకర్, చైర్మన్ ఎలా అంటారన్నారు. ప్రజా సమస్యలను బీఆర్ఎస్ సభలో లేవనెత్తకుండా చేయాలని ప్రభుత్వం మమ్మల్ని అడ్డుకుందని మండిపడ్డారు. తెలంగాణ ప్రకటన డిసెంబర్ 9 న ఎలా వచ్చిందో అందరికీ తెలుసన్నారు జగదీశ్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news