దమ్ముంటే ఇవాళ ఏపీ పోలీసులను సాగర్ మీదికి రమ్మను : సీఎం రేవంత్ రెడ్డి

-

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల రోజు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పోలీసులు తుపాకులు పట్టుకుని వచ్చి నాగార్జున సాగర్ ని ఆక్రమించుకుంటే ఎందుకు మాట్లాడలేదు. రం*డా పనులు చేసింది నువ్వు.. లొంగిపోయింది నువ్వు కేసీఆర్. నువ్వు రం*డా గాడివి కాబట్టే జగన్ వచ్చి ప్రాజెక్టును స్వాధీనం చేసుకున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దమ్ముంటే ఇవాళ ఏపీ పోలీసులను సాగర్ మీదికి రమ్మను అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

ప్రాజెక్టుల అప్పగింతపై అసెంబ్లీలో చర్చ పెడదామని, అది పూర్తి అయ్యే వరకు కేసీఆర్ సభలోనే కూర్చోవాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాలు నొప్పి, కన్ను నొప్పి, పంటి నొప్పి అంటూ ఇంట్లో పడుకొని నాటకాలు వేయవద్దు. మీ నాటకాలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అధికారం పోయిన తరువాత నీకు ఎక్కడ నొప్పి లేస్తుందో ప్రజలకు తెలుసు. నువ్వు రావాలి.. చర్చ జరగాలి.. మేము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version