తెలంగాణలో నక్సలైట్లు ఉండి ఉంటే టిఆర్ఎస్ నేతల ఆగడాలు సాగేవి కావు: కొండా సురేఖ

-

కొండా దంపతుల జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన”కొండా” సినిమా ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ తో కలిసి కొండా సురేఖ విజయవాడ వచ్చారు. అక్కడ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. నేటి రాజకీయాల్లో విలువలు లేవని, బిజెపి ప్రభుత్వంలో డబ్బు రాజకీయాలు నడుస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వాలు ప్రజల అభివృద్ధి కోసం పని చేయాలని అన్నారు. టిడిపి హయాంలోనే మాపై అక్రమ కేసులు పెట్టారని అన్నారు.

నక్సలైట్లతో కలిసి తెలంగాణ ఉద్యమం చేసిన కేసీఆర్ ఇప్పుడు వాళ్లనే అణచివేస్తున్నారని అన్నారు. తెలంగాణలో నక్సలైట్లు ఉండి ఉంటే టిఆర్ఎస్ నేతల ఆగడాలు సాగేవి కావు అన్నారు. నక్సలైట్ల హయాంలోనే తెలంగాణ బాగుండేది.. కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇచ్చిన భూములను టిఆర్ఎస్ పార్టీ లాక్కుంటుందని ఆరోపించారు. నక్సల్ ఉద్యమం చేసినప్పుడు ప్రజా జీవితానికి ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు అని కొండా సురేఖ చెప్పుకొచ్చారు.

అలాగే సినిమా విషయాలపై మాట్లాడుతూ.. మా దంపతుల నిజ జీవిత చరిత్ర ప్రజలకు తెలిపేందుకే “కొండా” సినిమా తీశాం అన్నారు. నక్సల్ ఉద్యమం, లవ్ స్టోరీ, రాజకీయ ప్రయాణం వంటి అంశాల ఆధారంగా ఈ సినిమా రూపొందిందన్నారు. కొండా సినిమా ప్రమోషన్లలో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నామని తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version