నేరాలకు పాల్పడితే.. ఎంతటి వారికైన శిక్షలు తప్పవు : సీఎం రేవంత్ రెడ్డి

-

నేరాలకు పాల్పడితే.. ఎంతటి వారికైన శిక్షలు తప్పవు అని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. గోషామహల్ స్టేడియంలో పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిఘా హాజరై అమరులైన పోలీసులకు నివాళులర్పించారు. జీతం కోసం పోలీసులు ఉద్యోగాలు చేయడం లేదు.   ఉద్యోగ, ఉపాధి కల్పనలో శాంతిభద్రతలే కీలకం అన్నారు.  సైబర్ క్రైమ్ లో మన విధానాన్ని కేంద్రం మెచ్చుకుంది. పోలీసుల సంక్షేమానికి ప్రతీ యేటా రూ.20కోట్లు అందిస్తున్నామని తెలిపారు. గంజాయి, డ్రగ్స్ కట్టడికి టీజీ న్యాబ్ ఏర్పాటు చేశాం. పండుగ నిర్వహణలో శాంతి భద్రతలు కాపాడాలి.

ఏఐ టెక్నాలజీతో ట్రాఫిక్ కట్టడి చేయాలి.  ప్రజలు సురక్షితంగా ఉన్నారంటే పోలీసులే కారణం అన్నారు. రాష్ట్రాన్ని కాపాడేందుకు ఎంతో మంది పోలీసులు అమరులు అయ్యారు. పదేళ్లలో రాష్ట్రంలో మత్తు పదార్థాల వినియోగం పెరిగింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని తగ్గించేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు. సమాజానికి సేవ చేసేందుకే పోలీసు శాఖలోకి ఉన్నత విద్యావంతులు వస్తున్నారని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version