వాష్ రూమ్ ని రెస్ట్ రూమ్ అని ఎందుకు అంటారు..? ఓహో ఇదా కారణం..!

-

సాధారణంగా మనం అనేక రకాల పదాలను వాడుతూ ఉంటాము. వాటి వెనుక అర్థం ఏంటో తెలియకుండా కూడా చాలా మంది వాడుతూ ఉంటారు. ఎక్కడైనా విన్న పదాలని లేదంటే ఎవరైనా చెప్పినవి మళ్లీ మళ్లీ మనం ఫాలో అవుతూ ఉంటాము. ఎవరినైనా చూసి లేదా ఎక్కడైనా విని కొంతమంది ఫాలో అవుతూ ఉంటారు. సాధారణంగా వాష్ రూమ్ ని రెస్ట్ రూమ్ అని కూడా అంటూ ఉంటారు. అసలు వాష్ రూమ్, రెస్ట్ రూమ్ అని ఎందుకు అంటారు..? ఈ పదం ఎలా పుట్టుకొచ్చింది అనే వాటి గురించి ఇప్పుడు చూద్దాం.

రెస్ట్ రూమ్ కి తెలుగులో అసలు పదం లేదు. ఇది వరకు బ్రిటిష్ల ప్రకారం రెస్ట్ రూమ్ అంటే ఒక ప్రభుత్వ బిల్డింగ్. అక్కడ ప్రజలు విశ్రాంతి తీసుకుంటారు. అలాగే రిఫ్రెష్ అవుతారని ఆ పదాన్ని ఉపయోగించేవారు. విశ్రాంతి గది అని దీనిని మనం అనొచ్చు. అదే ఒకవేళ అది బాగా పెద్దదిగా ఉంటే విశ్రాంతి భవనం అని కూడా అనొచ్చు. కేవలం స్నానాలు చేసే రూమ్ అయితే స్నానాలు గది అని తెలుగులో చెప్తారు.

అయితే రెస్ట్ రూమ్ అని వాడడం వెనుక అయితే అర్థం ఇది. రెస్ట్ రూమ్ లో కంఫర్ట్ గా కుర్చీలు, సోఫాలతో ఎంతో విశాలంగా ఉండేదట ఇన్ని సదుపాయాలు ఉండేవి కనుక రెస్ట్ రూమ్ అని పిలిచేవారు. బాత్రూమ్ అంటే స్నాన సౌకర్యాలు ఉన్నచోట బకెట్లు షవర్లు టాయిలెట్లు ఉంటాయి. వాష్ రూమ్ లో చేతులు కడుక్కోవడానికి సింక్ ఉంటుంది. అలాగే టాయిలెట్ సీట్ ఉండాలి. షాపింగ్ మాల్స్ పెద్దపెద్ద విశ్రాంతి గదులు ఎక్కువగా కార్యాలయాలు లేదా సినిమా థియేటర్లలో మాత్రమే ఇవి ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version