ఆకతాయిల ఆగడాలు శృతిమించుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎయిర్ పోర్టులు, విమానాలు, రైల్వేస్టేషన్లకు ఇటీవల బాంబు బెదిరింపు కాల్స్ పెరిగిపోయాయి. దీంతో అటు విమానయాన సంస్థలు, ఇటు ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు.మరికొందరైతే భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే బాంబు బెదిరింపులకు పాల్పడిన ఆకతాయిల ఆటకట్టించేందుకు కేంద్రపౌరవిమానయాన శాఖ కఠిన నిబంధనలు తెచ్చేందుకు సిద్ధమైంది.
ప్యాసింజర్, కార్గో సహా సెకండరీ లాడార్ పాయింట్ల వద్ద హ్యాండ్ బ్యాగుల వద్ద బ్యాగుల చెకింగ్ ముమ్మరం చేయనుంది. మెసేజులు పెడుతున్న వారిని పట్టుకునేందుకు వీపీఎన్ ప్రొవైడర్లతో కలిసి పనిచేయనుంది. ఎస్ఎమ్‌లో ఒకే అకౌంట్ నుంచి ఎక్కువ మెసేజెస్ పెట్టి గంటల్లోనే డిలీట్ చేయడాన్ని గమనించిన సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) సైబర్ టీమ్స్‌ను అలర్ట్ చేసింది.