పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే.. అధికారులకు చర్యలు తప్పవు.. మంత్రి ఉత్తమ్ వార్నింగ్..!

-

పనుల్లో నిర్లక్ష్యం గా వ్యవహరిస్తే.. కఠిన చర్యలు తప్పవని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఇవాళ జల సౌదలో రాష్ట్రంలోని నీటి పారుదల ఉన్నతాధికారులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రాధాన్యత ప్రాజెక్టులను సాధ్యమైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రాజెక్టుల్లో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించి పనులు పూర్తి చేయాలన్నారు.

ప్రాధాన్యత ప్రాజెక్టులకు నిధుల కొరత ఉండదన్నారు. నీటి పారుదల శాఖకు నిధుల కేటాయింపులు బాగున్నాయని.. పనులు వేగవంతం చేయాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో పనులు లక్ష్యాలకు అనుగుణంగా చేయాలన్నారు. అధికారులకు అప్పగించిన పనులను సకాలంలో పూర్తి అయ్యేలా చూసే బాధ్యత మీదే అన్నారు. పనులను మంచిగా చేసిన వారిని గుర్తిస్తామన్నారు. కమిట్ మెంట్, సీనియారిటీ తప్పకుండా ఉండాలన్నారు. ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం చేసే కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. పనులు చాలా బాధ్యతగా చేయాలని సూచించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version