పాఠశాల లేక 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులు..!

-

సాధారణంగా మనకు ఎన్ని ఆస్తులున్నప్పటికీ ఈరోజుల్లో చదువును మించిన ఆస్తి లేదని పలువురు పెద్దలు, ఉపాధ్యాయులు, మేధావులు చెబుతుంటారు. చదువు కోసం కొందరూ లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. పేదలు  తమ పిల్లలను చదివించేందుకు చాలా శ్రమిస్తుంటారు. అయితే ఇలాంటి తరుణంలోనే ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.

పాఠశాల లేక దాదాపు 4 కిలోమీటర్ల మేర వరకు నడుచుకుంటూ వెళ్తున్నారు  విద్యార్థులు. మాజీ మంత్రి హరీష్ రావు చొరవతో గత ఏడాది వరకు నడిచిన పాఠశాలను ఎత్తివేసారు అధికారులు. సిద్దిపేట జిల్లా – మండలం మధిర గ్రామం పక్కన పిట్టలవాడలో 70 ఇండ్లు ఉన్నప్పటికీ ప్రస్తుతం అక్కడ పాఠశాల లేదు. గతేడాది వరకు హరీష్ రావు చొరవతో ఉపాధ్యాయులు వెళ్లి పాఠాలు చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆ పాఠశాలను ఎత్తేసి ఉపాధ్యాయులను బదిలీ చేయడంతో ఆ వాడ పిల్లలు పాఠశాలకు వెళ్లడానికి రోజు 4 కిలోమీటర్లు నడుస్తున్నారు. చదువు చదవాలని ఆశగా ఉందని.. తిరిగి తమ వాడలో పాఠశాలను ప్రారంభించాలని విద్యార్థులు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version