మహబూబాబాద్‌లో 144 సెక్షన్ అమలు లోకి వచ్చింది. ఇవాళ మహబూబాబాద్‌లో 144 సెక్షన్ అమలు లో ఉండనుంది. నలుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడదంటూ ఆదేశాలు జారీ చేశారు పోలీసులు. ఎవరైనా పోలీసు చట్టాన్ని ఉల్లంఘిస్తే.. చట్టపరమైన చర్యలు తీసిఉంటామని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు.
ఈ మేరకు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ (ఐపీఎస్) ప్రకటన కూడా చేశారు. ఇవాళ మహబూబాబాద్‌లో మహాధర్నాకు కేటీఆర్ పిలుపు ఇచ్చారు. అయితే ఇవాళ మహబూబాబాద్‌లో మహాధర్నాకు అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్డర్ కాపీలు పోలీసులు..అందజేసారూ.వికారాబాద్ జిల్లాలో ఘటన జరిగితే.. మహబూబాబాద్‌లో ధర్నా చేయడం ఏంటి? ఇక్కడ ధర్నాకు అనుమతి ఇవ్వం.. ఎవరైనా రాళ్లు లేదా ఇంకేమైనా విసిరితే తోలు తీస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు.