తెలంగాణ టీచర్లకు బిగ్‌ షాక్‌..టీచర్ల హాజరుపై కీలక ఆదేశాలు !

-

తెలంగాణ టీచర్లకు బిగ్‌ షాక్‌..టీచర్ల హాజరుపై కీలక ఆదేశాలు జారీ చేసింది కేసీఆర్‌ సర్కార్‌. ప్రభుత్వ ఉపాధ్యాయుల హాజరుపై విద్యాశాఖ దృష్టి పెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో చాలామంది టీచర్లు సెలవులు పెట్టకుండా, సమాచారం ఇవ్వకుండా దీర్ఘకాలిక విధులకు డుమ్మా కొడుతున్నట్లు సర్కారు గుర్తించింది.

వారి హాజరును పరిశీలించాలని DEO, RJDలను ఆదేశించింది. జనవరి నుంచి జూన్ వరకు వివరాలను డీఈవోలకు పంపాలనే ప్రధానోపాధ్యాయులకు సూచించింది. అనధికారికంగా విధులకు గైర్హాజరైతే వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

ఇక అటు తెలంగాణ రాష్ట్రంలోని 20,555 మంది VRA ల్లో 5,950 మందిని ఇరిగేషన్ శాఖలో లష్కర్లుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరికి రూ. 19 వేల మూల వేతనం అందనుందని తెలుస్తోంది. కాగా, మొత్తం VRAల్లో దాదాపు 10వేల మంది కేవలం సంతకం చేయగలిగేవారే. దీంతో వారిని ఎలా రెగ్యులరైజ్ చేయాలనే దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్న వారిని అటెండర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో నియమించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version