సిద్దిపేటలో ఐటీ టవర్ ప్రారంభం

-

సిద్దిపేటలో రూ.63 కోట్ల వ్యయంతో నిర్మించిన ఐటీ హబ్‌ను మంత్రి హరీష్ రావుతో కలిసి ప్రారంభించారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఈ ఐటీ టవర్ ఏర్పాటుతో ప్రత్యక్షంగా వెయ్యి మందికి, పరోక్షంగా 4 వేల మందికి ఉపాధి లభించనుంది. ప్రభుత్వంతో 15 అంతర్జాతీయ కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేట ను వల్లి రంగాలలో అభివృద్ధి చేసుకున్నామని.. ఇప్పుడు ఐటీ ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పారు.

ఇక ఈ ఐటి టవర్ లో మొదటి అంతస్తులో కాఫీటేరియా, ప్రయోగశాల, సమావేశ గదులు, ఇంటర్వ్యూ గదులు ఉన్నాయి. పట్టణ శివారులో రాజీవ్ రహదారిపై సుమారు రూ.63కోట్లలతో 60వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఇందుకోసం భవనాన్ని నిర్మించారు. ఐటీ టవర్ మొదటి అంతస్తులో కాఫీటేరియా, ప్రయోగశాల, సమావేశ గదులు, ఇంటర్వ్యూ గదులు ఉన్నాయి.

రెండో అంతస్తులో క్యాబిన్లు, ఒపెన్ వర్క్ స్టేషన్లు, క్లోజ్డ్ వర్క్ స్టేషన్లు ఉన్నాయి. టాస్క్ శిక్షణ కేంద్రం ఇక్కడే ఉంది. మూడో అంతస్తులో టీఎస్ఐఐసీ కార్యాలయం, బోర్డు గదులు, వీహబ్, వర్క్ స్టేషన్లు ఉన్నాయి. నాలుగో అంతస్తులో సైతం వర్క్ స్టేషన్లు ఉన్నాయి. సిద్దిపేట ఐటీ టవర్‌లో కార్యకలాపాలు నిర్వహించే పరిశ్రమలకు ప్రభుత్వం.. రెండు సంవత్సరాల పాటు నిర్వహణ, అద్దె, విద్యుత్ బిల్లు, ఇంటర్నెట్ బిల్లుల్లో మినహాయింపులు ఇస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version