నేటి నుంచి ఐనవోలు మల్లన్న జాతర ప్రారంభం కానుంది. ధ్వజారోహణతో ఉత్సవాలు షురూ కానున్నాయి. సంక్రాంతి తో మొదలై ఉగాది వరకు 3 నెలలపాటు సందడిగా సాగే జానపదుల జాతర తెలంగాణ వాసులకు ఎంతో ప్రత్యేకం అన్న సంగతి తెలిసిందే.
ముచ్చటైన స్వాగత తోరణాలతో రారామ్మనిపించే ఐనవోలు మల్లన్న ఆలయం చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇక నేటి నుంచి ఐనవోలు మల్లన్న జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలోనే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
ఇక అటు హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో ఈరోజు నుంచి వీరభద్రస్వామి జాతర ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ సాయంత్రం కుమ్మరి బండి తిరుగుట ఉంటుంది. రేపు ఎడ్ల బండ్లు తిరుగుట కార్యక్రమం ఉంటుంది. 18 వ తేదీన జరిగే అగ్నిగుండాల కార్యక్రమంతో జాతర ఉచ్చవాలు ముగింపు ఉంటుంది. జాతర కు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది ఆర్టీసీ.