ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్ర రైతాంగం చాలా సంతోషంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మంగళవారం మంథనిలో పర్యటించిన శ్రీధర్ బాబు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. రుణమాఫీ, సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ అందించడంతో పాటు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా కింద అందించే పెట్టుబడి సహాయాన్ని రూ.12 వేలకు పెంచుతున్నామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తున్నామని అన్నారు.
ప్రతి గ్రామపంచాయతీలో రైతు రుణమాఫీ, సన్న వడ్లకు బోనస్, పెట్టుబడి సహాయం రైతులు వివరాలు ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా కేబుల్ ఛానల్ లో సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మంథని పట్టణానికి రింగ్ రోడ్డు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.