కేటీఆర్ – కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకున్నారు. వాళ్లు ఇంకా సీఎం, మంత్రి అన్న భావనలో ఉన్నారు అని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. అడ్వకేట్ లను తీసుకొస్తా అని కేటీఆర్, నా ఇంట్లో విచారణ చేయాలని కవిత విచారణ అధికారుల ముందు డిమాండ్లు పెడుతున్నారు. కేసీఆర్ ఉద్యమం చేసినందుకు గౌరవించవచ్చు. కానీ ఆయన కొడుకు, కూతురు కారణంగా నష్టపోయారు. కేటీఆర్ ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. చర్లపల్లా లేక తీహార్ జైలా అన్నది ఆయన ఎంచుకోవాలి. కేటీఆర్ జైలుకు వెళ్ళక తప్పదు అని పేర్కొన్నారు.
అలాగే బీజేపీ కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నాను. కేసీఆర్ ఓడిపోయాక ఈ సంస్కృతి పోయిందని అనుకున్నా.. మా పార్టీ తెలంగాణ నుంచి కాశ్మీర్ వరకు ఉంది. తిరగబడి దాడి చేస్తే మీ పరిస్థితి ఏంటి.. మేము రియాక్ట్ అయితే మీ జాతీయ నాయకులు దాక్కోడానికి కూడా ప్లేస్ దొరకదు. ఇదే మొదటి, చివరి హెచ్చరిక అని ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు.