తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదు అవుతున్నాయి. మరో వారం రోజుల్లో 40 డిగ్రీలు కూడా టెంపరేచర్లు దాటుతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికైతే కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదు అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి.

ఉదయం 9 గంటలు కాగానే ఎండ తాకిడి ఎక్కువ అవుతుంది. తీవ్రమైన ఎండ అలాగే వేడిగాడ్పులు… ఉక్కపోతలతో తెలంగాణ ప్రజలు.. చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరో వారం రోజుల్లో మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదు అవుతాయని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. 40 డిగ్రీలు దాటిన సమయంలో అసలు బయటికి వెళ్లకూడదని కూడా సూచిస్తున్నారు. ఏప్రిల్ అలాగే మే నెల వచ్చేసరికి… పగటిపూట ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల వరకు కూడా చేరే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.