ఎర్రకోటపై స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్దం..1800 మందికి ఆహ్వానం

-

రేపు ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ఆగస్టు 15న ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రత్యక్షంగా పాల్గొనడానికి, జాతీయ జెండాను ఎగుర వేసిన తర్వాత గౌరవనీయ ప్రధాన మంత్రి చేసే ప్రసంగాన్ని వినడానికి దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన 1800 మంది వ్యక్తులకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి.

Independence Day 2023

ఈ 1800 మంది ప్రత్యేక అతిథుల సమక్షంలో ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతాయి. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. వైబ్రంట్‌ విలేజ్‌ల సర్పంచులు, ఉపాధ్యాయులు, నర్సులు, రైతులు, మత్స్యకారులు; సెంట్రల్ విస్టా ప్రాజెక్టు, అమృత్ సరోవర్, హర్‌ఘర్ జల్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో పని చేస్తున్న వ్యక్తులు ప్రత్యేక ఆహ్వానితుల్లో ఉన్నారు.

దేశవ్యాప్తంగా, కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్న 50 మందికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రత్యేక ఆహ్వానాలు పంపింది. ఆగస్టు 15న చారిత్రాత్మక ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను చూసేందుకు జీవిత భాగస్వాములతో కలిసి న్యూదిల్లీ రావాలని ఆహ్వానాలు పంపింది. వీరిలో, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ప్రత్యేక వ్యక్తులకు కూడా ఆహ్వానం అందింది. కేంద్ర ప్రభుత్వ ‘జన్ భాగీదారి’ దార్శనికతకు అనుగుణంగా, దేశంలోని ప్రతి వర్గం ప్రజలకు ఎర్రకోటలో జరిగే వేడుకల్లో ప్రత్యక్షంగా పాల్గొనే, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగాన్ని వినే అవకాశం కల్పించడం కోసం మంత్రిత్వ శాఖ ఈ ఆహ్వానాలు పంపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version