ఎన్నికల కోడ్ ఎఫెక్ట్.. హైదరాబాద్​లో జరగాల్సిన ఇండియన్ రేసింగ్ లీగ్‌ రద్దు

-

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ క్రమంలోనే పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న నగదు, బంగారం పట్టుకుంటున్నారు. మరోవైపు ప్రభుత్వ కార్యక్రమాలేవి జరగకుండా నిఘా పెడుతున్నారు. కోడ్ ఉల్లంఘటన జరిగితే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఎన్నికల కోడ్ ప్రభావం రేసింగ్​పై పడింది ఇప్పుడు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

హైదరాబాద్​లోని హుస్సేన్ సాగర తీరాన నిర్వహించనున్న ఇండియన్ రేసింగ్ లీగ్ పై ఎన్నికల కోడ్ ప్రభావం పడింది. తెలంగాణలో ఎన్నికల కోడ్ ఉండడం తో రేసింగ్ నిర్వహించడం లేదని నిర్వాహకులు తెలిపారు. ఈ వేదికను చెన్నై కి తరలించినట్లు వెల్లడించారు. రేస్ కోసం నిన్నటి వరకూ నిర్వాహకులు శరవేగంగా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ లో రద్దైన ఈ లీగ్ ను నవంబర్ 4, 5 తేదీల్లో నే చెన్నై లోని మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ లవ్ నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే ఆన్ లైన్లో టికెట్లు అమ్మకం జరగగా డబ్బులు తిరిగి ఇస్తామని ఈ వివరాలు వారి వారి వ్యక్తిగత మెయిల్ ఐడీలకు పంపుతామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version