తెలంగాణ రాష్ట్రంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

సూర్యాపేట జిల్లా ఇమాంపేట బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న వైష్ణవి అనే అమ్మాయి శనివారం రాత్రి తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వైష్ణవి అనే అమ్మాయి ఆత్మహత్య సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు….దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.