Telangana: ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. బాధతో తండ్రి ఆత్మహత్య

-

Telangana: ఇంటర్మీడియట్ ఫెయిలయిందని విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. బాధతో పురుగుల మందు తాగి తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హన్మకొండలో చోటు చేసుకుంది. హన్మకొండలోని నడికూడ మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన గాజ కుమారస్వామికి(47) భార్య రమాదేవి, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. తన చిన్న కూతురు శ్రీవిద్య గతేడాది హనుమకొండలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదివి కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిలైంది. ఇటీవల సప్లమెంటరీ పరీక్షలు రాసినా పాస్ కాలేదు.

inter student father died

దీంతో తండ్రి కూతురిని మందలించాడు. అసలే పరీక్షల్లో పాస్ కాకపోవడం, తండ్రి కోపం చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురై శ్రీవిద్య ఇంట్లో ఉన్న పురుగులమందు తాగింది. ఆమెను వెంటనే పరకాల ఆస్పత్రికి తరలించారు. అయితే తన వల్లే కూతురు ఆత్మహత్యకు యత్నించిందని భావించిన కుమారస్వామి పరకాలలోని ఫెర్టిలైజర్ షాపులో పురుగులమందు తీసుకుని కంఠాత్మకూర్ సమ్మక్క సారలమ్మ గద్దెల వైపు వెళ్లి మందు తాగి మృతి చెందారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర విషాదానికి లోనయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version