కేసీఆర్ సత్య హరిచంద్రుడే.. జగదీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

-

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముమ్మాటికీ స‌త్య‌హ‌రిశ్చంద్రుడే అని మాజీ విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి తేల్చిచెప్పారు. రేవంత్‌లా సంచులు మోసే చంద్రుడు కాదు అని ఆయ‌న పేర్కొన్నారు. శాస‌న‌స‌భ‌లో విద్యుత్ ప‌ద్దుల‌పై చ‌ర్చ సంద‌ర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. స‌త్య‌హ‌రిశ్చంద్రులు అయితే ఎందుకు విద్యుత్ జ్యుడిషియ‌ల్ క‌మిష‌న్‌కు అడ్డు వ‌స్తున్నార‌ని పేర్కొన్నారు. దీనిపై జ‌గ‌దీశ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.

విద్యుత్ విష‌యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం దొంగ‌త‌నం దొరికిపోయింది కాబ‌ట్టే రేవంత్ రెడ్డి ఎందుకు భుజాలు త‌డుముకుంటున్నార‌ని జ‌గ‌దీశ్ రెడ్డి నిల‌దీశారు. మా అధినేత‌ కేసీఆర్ హ‌రిశ్చంద్రుడే. రేవంత్ రెడ్డిలా సంచులు మోసే చంద్రుడు కాదు.. చంద్రుడికి సంచులు మోసి జైలుకు పోయింది రేవంత్ రెడ్డినే అని జ‌గ‌దీశ్ రెడ్డి గుర్తు చేశారు. నేను విద్యుత్ విష‌యంలో నిజ‌నిజాలు మాట్లాడుతుంటే.. రేవంత్ రెడ్డినే వ‌డివ‌డిగా స‌భ‌లోకి వ‌చ్చి నాకు అడ్డు త‌గిలారు. సీఎం స‌భ‌లో అడుగు పెట్ట‌గానే త‌ప్పుదోవ ప‌ట్టింది. కేసీఆర్ కాలు గోటికి మీరు స‌రిపోతారా..? కేసీఆర్ గురించి మాట్లాడింది రికార్డుల నుంచి తొల‌గించండి.. స‌భ‌ను హుందాగా న‌డిపించాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version