అల్లు తరం వారు ఇలాంటి సినిమాలను ప్రోత్సహించడమా..? : సీపీఐ నేత నారాయణ

-

సంధ్య థియేటర్  తొక్కిసలాట ఘటనలో పోలీసులు తప్పు లేదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అమరావతి  లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబంతో కలిసి సినిమా చూసేందుకు వెళ్లిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వం భవిష్యత్తులో ఇలాంటి ఘటనకు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా సినిమా టికెట్ల రేట్లను పెంచాడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

ఇక నుంచి సందేశాత్మక, చారిత్రక నేపథ్యం కలిగిన సినిమాలకు మాత్రమే రాయితీలు, టికెట్ల పెంపునకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదర్శ నటులు అల్లు తరం వారు ఇలాంటి సినిమాలను ప్రోత్సహించడమా..? అని ఆక్షేపించారు.  పుష్ప-2  సినిమాలో ఎర్రచందనం స్మగ్లర్ ని హీరోగా చూపించడం ఏంటని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి సినిమాకు ప్రజలపై భారం మోపుతూ టికెట్లను రేట్లను పెంచిన తెలంగాణ ప్రభుత్వం  మొదటి మద్దాయి అని ఫైర్ అయ్యారు. ఇందులో పోలీసులు తప్పు ఏమి లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. వేలకు వేలు ఖర్చు పెట్టినా ఈ రోజుల్లో కుటుంబంతో కలిసి సినిమా చేడలేని పరిస్థితి ఉందని నారాయణ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version