మీ అమ్మ గారు ఆసుపత్రిలో ఉన్నా.. జట్టుకే తొలి ప్రాధాన్యత ఇచ్చావు.. అశ్విన్ పై మోడీ ప్రశంసలు

-

టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే భారత క్రికెట్ కి అందించిన సేవలకు ఖేల్ రత్న అవార్డుతో సత్కరించాలని ఇప్పటికే పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోడీ అశ్విన్ ను అబినందిస్తూ ప్రత్యేకంగా లేఖ రాశారు. అతని నిర్ణయం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసిందంటూ ప్రధాని మోడీ అందులో ప్రస్తావించారు. 

PM MODI

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు మీ నిర్ణయం పై ఆశ్చర్యానికి గురయ్యారు. ఎన్నో ఆప్ బ్రేక్స్, క్యారమ్ బంతులతో ప్రత్యర్థులను హడలెత్తించారు. ఇప్పుడు ఈ నిర్ణయం కూడా క్యారమ్ బాల్ మాదిరిగా ఉంది. ఇలాంటి ప్రకటన చేయడం కూడా అత్యంత కఠినమని అందరికీ తెలుసే. భారత్ కోసం అద్భుతమైన ప్రదర్శన చేశావు. అందుకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు చెబుతున్నా. జట్టు కోసం వ్యక్తిగత జీవితాన్ని సైతం పక్కన పెట్టావు. మీ అమ్మగారు ఆసుపత్రిలో ఉన్నప్పుడూ కూడా జట్టు కోసం ఆలోచించావు. చెన్నై వరదలు వచ్చినప్పుడు సాయం చేసేందుకు ముందుకు వచ్చావు” అంటూ మోడీ పేర్కొన్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version