తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శాఖ ఏమిటో గాని ఆయనకు బాంబుల శాఖ మంత్రి అని పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంల్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ బాంబు పేలి కాంగ్రెస్ లో ఎవరు ఎగిరిపోతరో ఆయనకే తెలియాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒకటి మాత్రం పక్కా అని వీళ్లని వదిలిపెట్టమని మరోసారి హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి డిసెంబర్ 7వ తేదీకి ఏడాదవుతుందని, వీళ్లు ఏదో పీకు పందిరేసినట్లుగా ఏడాడి గడిచిందని విజయోత్సవ వారోత్సవాలు చేయాలంటున్నారని, నవంబర్ 29వ తేదీన కేసీఆర్ రాష్ట్ర సాధన ఉద్యమంలో నిరాహార దీక్ష ప్రారంభించారని, మేం కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వైఫల్యాల వారోత్సవం మేము కూడా చేస్తామని త్వరలో డిక్లేర్ చేస్తామన్నారు.
ఏ శాఖలో ఎవరెవరిని మోసం చేసి ఎంతెంత తిన్నారో మేం చెబుతామని, పాదయాత్రలు, మిగతా కార్యక్రమాలు తర్వాత ప్రకటిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో బీసీ, దళిత బంధు, రైతు బంధు, బీసీ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంట్ పోయిందన్నారు. బీసీలకు ఇచ్చిన డిక్లరేషన్ హామీలను అమలు చేయనందుకు బీసీలకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేకు ఇళ్ళకు