రైతులకు భరోసా ఇచ్చామని చెప్పగలరా..? : హరీశ్ రావు

-

రేవంత్ రెడ్డి రుణమాఫీ బోగస్, రైతుబంధు బోగస్, వరికి బోనస్ బోగస్ అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నాయకుడు హరీశ్‌రావు విమర్శించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీపై మాట తప్పామని మహారాష్ట్ర ప్రజలకు చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. మహారాష్ట్రకు వెళ్లి అన్ని అబద్దాలే ప్రచారం చేస్తున్నాడని.. మొదటి సంతకం ఏకకాలంలో రుణమాఫీ అన్నారని చెప్పారు. డిసెంబర్ 9 2023 రుణమాఫీ చేస్తామని మాట తప్పామని మహారాష్ట్ర ప్రజలకు చెప్పాలన్నారు. 42 లక్షల మందికి రూ.31 వేల కోట్ల చేస్తామని.. రూ.17వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని అన్నారు.

రుణమాఫీ చేశామని ట్విట్టర్‌లో ప్రచారం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ మోసం చేసే ప్రయత్నం చేస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు. 40 లక్షలు రుణమాఫీ చేశామని కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌లో పెట్టి మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసుకుంటుందని మండిపడ్డారు. రుణమాఫీ 7 నెలలు ఆలస్యం చేసి రైతులపై వడ్డీల భారం మోపింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. బ్యాంకులు ముక్కుపిండి రైతుల నుంచి వడ్డీలు వసూలు చేశాయని.. ప్రభుత్వం ఆలస్యం చేయటంతో రైతులపై వడ్డీ భారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version