బుల్డోజర్లతో తొక్కించడానికి ఇదేమైనా పాకిస్తానా..? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

బుల్డోజర్లతో తొక్కించడానికి ఇదేమైనా పాకిస్తానా..? అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. యాదగిరిగుట్ట-భువనగిరి జిల్లాలోని పోచంపల్లి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. తాము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని.. పేదల ఇళ్ల కూల్చివేతలను మాత్రమే వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు.

మరోవైపు సన్న వడ్లకే బోనస్ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమలు కాలేదని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో వడ్లకు 500 బోనస్ ప్రకటించి.. ఇప్పుడు మాత్రం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని అంటున్నారని.. రాష్ట్రంతో 17 లక్షల మందికే రుణమాఫీ చేశారని, మిగిలిన రైతులను వదిలేశారని మండిపడ్డారు. మూసీ ప్రక్షాళనకు లక్షా 50 వేల కోట్లు ఖర్చవుతుందని చెబుతున్నారు. ఆ డబ్బు ఎప్పుడు ఎలా వస్తుందో వారికే తెలియదని, రాష్ట్రంలో రైతులు కష్టపడి పండించిన పంటను కొనే దిక్కులేదని.. రాష్ట్రంలో ఏ ఒక్క గ్యారంటీ అమలు కాలేదని విమర్శించారు. అలాగే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి దమ్ముంటే.. తెలంగాణ రాష్ట్రంలోని వడ్ల కొనుగోలు కేంద్రాలకు రావాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version