తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు ఏడాది పూర్తి అయింది. ఈ తరుణంలోనే సీఎం రేవంత్ సంచలన ట్వీట్ చేశారు. ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు… పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు…పోలింగ్ బూతుకు వెళ్లి “మార్పు” కోసం ఓటేశాడని గుర్తు చేశారు. ఆ ఓటు అభయహస్తమై…రైతన్న చరిత్రను తిరగరాసిందని పేర్కొన్నారు.
ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ…రూ.7,625 కోట్ల రైతు భరోసా…ధాన్యానికి క్వింటాల్ కు రూ.500 బోనస్…రూ.10,444 కోట్ల ఉచిత విద్యుత్…రూ.1433 కోట్ల రైతుబీమా…రూ.95 కోట్ల పంట నష్ట పరిహారం…రూ.10,547 కోట్ల ధాన్యం కొనుగోళ్లకు దారి తీసిందని వెల్లడించారు. ఒక్క ఏడాదిలో …54 వేల కోట్ల రూపాయలతో…రైతుల జీవితాల్లో పండగ తెచ్చామన్నారు. ఇది నెంబర్ కాదు…రైతులు మాపై పెట్టుకున్న నమ్మకం అన్నారు. ఈ సంతోష సమయంలో…అన్నదాతలతో కలిసి…రైతు పండుగలో పాలు పంచుకోవడానికి…ఉమ్మడి పాలమూరుకు వస్తున్నా అంటూ ప్రకటించారు సీఎం రేవంత్.
ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు…
పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు…
పోలింగ్ బూతుకు వెళ్లి “మార్పు” కోసం ఓటేశాడు.
ఆ ఓటు అభయహస్తమై…
రైతన్న చరిత్రను తిరగరాసింది.ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ…
రూ.7,625 కోట్ల రైతు భరోసా…
ధాన్యానికి క్వింటాల్ కు రూ.500 బోనస్…
రూ.10,444 కోట్ల ఉచిత…— Revanth Reddy (@revanth_anumula) November 30, 2024