తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. మీ సేవ మొబైల్ యాప్ ను ప్రారంభించారు మంత్రి శ్రీధర్ బాబు. దీంతో ఇక పై మరో 9 సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. మీ సేవ మొబైల్ యాప్ ను ప్రారంభించిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు..మొబైల్ లోనే మీ సేవ సర్వీసులు పొందేలా యాప్ రూపకల్పన చేయించారు. మీ సేవలో మరో తొమ్మిది రకాల సర్వీసులను యాడ్ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
గ్యాప్ సర్టిఫికెట్.. సిటిజన్ నేమ్ చేంజ్ వంటి తొమ్మిది రకాల అంశాలను కొత్తగా అందుబాటులోకి తెచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇన్ని రోజులు ఫిజికల్ గా వెళ్లి తీసుకునే అంశాలను ఇక నుంచి మీ సేవ నుంచే పొందే అవకాశం ఉంది. మీ సేవలో కొత్త సర్వీసులను ప్రారంభించిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు..ఈ సేవలు వినియోగించుకోవాలని ప్రకటించారు.