తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి షాక్ తగిలింది. రేపు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు సర్పంచులు. అసెంబ్లీ సమావేశాల రేపటి నుండి మొదలవుతున్న సందర్భంగా.. తమ పెండింగ్ బిల్లులపై చర్చించాలని, సమావేశాలు ముగిసేలోగా రూ.500కోట్ల బకాయిలను విడుదల చేయాలని అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు సర్పంచులు. ఈ మేరకు ప్రకటన చేశారు.
కాగా, రేపటి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు పై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు. రేపు ఉదయం 10.30 కి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై సభలో ప్రకటన చేయనున్న సీఎం రేవంత్…సభ ముగిసిన తర్వాత… సచివాలయం లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ చేస్తారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు.