రైతులకు మొదటి శత్రువు కాంగ్రెస్‌ పార్టీ : మంత్రి జగదీశ్ రెడ్డి

-

రైతులకు మొదటి శత్రువు కాంగ్రెస్‌ పార్టీ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని నాశనం చేసింది కాంగ్రెస్‌ పార్టీ అని ధ్వజమెత్తారు. గతంలో రైతుల పట్ల కాంగ్రెస్‌ పార్టీ కక్షపూరిత పాలన చేసింది అని.. గతంలో రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌ హామీ ఇచ్చారని అన్నారు. గతంలో ఉచిత విద్యుత్‌ హామీని కాంగ్రెస్‌ విస్మరించిందని.. వైఎస్‌ఆర్‌ హయాంలో 9 గంటల విద్యుత్‌ ఇవ్వట్లేదని రైతులు ధర్నా చేశారని గుర్తు చేశారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తే ఎందుకు ఏడుపు అని ప్రశ్నించారు.

‘ప్రజలకు ఏదీ ఉచితంగా ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్‌కు లేదు. కాంగ్రెస్‌ నేతలు రైతు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. సాగుకు 3 గంటల ఉచిత విద్యుత్‌ చాలని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ నేతలకు ఇంట్లో 24 గంటల విద్యుత్‌ ఉండాలి. రైతులకు మాత్రం 24 గంటల విద్యుత్‌ ఉండవద్దా? కాంగ్రెస్‌ పార్టీ రైతుల పట్ల దుర్మార్గపు ఆలోచనలు చేస్తోంది. తెలంగాణ రైతులకు కాంగ్రెస్‌ పార్టీ సమాధానం చెప్పాలి. రైతులతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు చేస్తారు.’ అని మంత్రి జగదీశ్ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version