ఈ నెల 9న తెలంగాణ బంద్‌ !

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలర్ఠ్. ఈ నెల 9న తెలంగాణ బంద్‌ కానుందట. ఈనెల 9న తెలంగాణ బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ములుగు జిల్లాల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చినట్టు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ స్పష్టం చేశారు.

Jagan, the spokesperson of the Maoist party has clarified that a bandh has been called for across Telangana state

పోకలమ్మ వాగు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో మొత్తం ఏడుగులు మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక అటు ఏటూరునాగారంలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏటూరునాగారంలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై మాకు అనుమానాలు ఉన్నాయని బాంబ్‌ పేల్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఫేక్ ఎన్‌కౌంటర్లు ఎప్పటికైనా తప్పే.. గతంలో కేసీఆర్ గారు కూడా ఎన్‌కౌంటర్లకు ఒప్పుకోలేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version