జగిత్యాల ఫారెస్ట్ ఆఫీస్ లో దసరా దావత్ చేసుకున్న..అధికారిని సస్పెండ్ చేశారు. రెండు రోజుల కిందట జగిత్యాల ఫారెస్ట్ ఆఫీస్లో అధికారుల లిక్కర్ దావత్ జరిగింది. వన్య ప్రాణి మాంసంతో ఫారెస్ట్ ఆఫీసర్ల దసరా దావత్ చేసుకున్నారని అనుమానాలు వచ్చాయి. నెమలి, అడవి పంది మాంసంగా అనుమానాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ తరునంలోనే… జగిత్యాల డిప్యూటీ పారెస్ట్ రేంజ్ అధికారి జగిత్యాల అరుణ్ కుమార్ ను సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేసింది డిఎఫ్ఓ.
ముత్యంపేట బీట్ ఆఫీసర్ సాయిరాం, జగిత్యాల లక్ష్మణ్ TM ( ఔట్సోర్సింగ్ ఉద్యోగి )ని సస్పెండ్ చేస్తూ డిఎఫ్ఓ జగిత్యాల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 11న జగిత్యాల అటవీ శాఖ కార్యాలయంలో సామిల్ యజమానులు, జిల్లా లో ని సిబ్బంది తో దావత్ ఏర్పాటు చేసి మద్యం సేవించింది అధికారులు, సిబ్బంది. దీనికి బాధ్యుడైన deputy రేంజ్ అధికారి అరుణ్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఉన్నతాధికారులు.