ఆంధ్రాలో మద్యం దుకాణాలకు సంబంధించిన లక్కీ డ్రా ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ప్రక్రియ ప్రారంభం అవ్వగా.. రాష్ట్రవ్యాప్తంగా లాటరీలు తీస్తున్నారు. అయితే, కొన్ని చోట్ల డ్రా తీసే క్రమంలో గందరగోళం ఏర్పడింది. ఒక నెంబర్‌కు బదులు మరో నెంబర్ ప్రకటించడంతో దరఖాస్తుదారులు ఆందోళనకు దిగుతున్నారు.
అలా ఎలా పిలుస్తారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఈ ఘటన శ్రీకాకుళంలో చోటుచేసుకుంది.జిల్లాలోని వైన్ షాపులకు ప్రభుత్వం తరపున ఈ ఉదయం నుంచి లాటరీ ప్రక్రియ సాగుతోంది. అయితే నంబర్ 9కి బదులు నెం.6 ప్రకటించడంతో గందరగోళం నెలకొంది. దీంతో అధికారులతో దరఖాస్తుదారులు వాగ్వాదానికి దిగారు. అండర్ స్కోర్ విషయంలో పొరపాటు జరిగిందని, మళ్లీ సవరించి నెంబర్ -9గా ప్రకటించడంతో వివాదం సర్దుమనిగింది.