ప్రస్తుత రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి జైపాల్ రెడ్డి అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. దేశ చరిత్రలో ప్రజాస్వామ్య విలువ కాపాడిన గొప్ప నాయకుడు అని, తెలంగాణ రాష్ట్ర సహకారం చేయడంలో జైపాల్ రెడ్డి పాత్రను మర్చిపోలేమన్నారు. హైదరాబాద్ అంతర్జాతీయంగా గుర్తింపు రావడానికి.. మెట్రో రైల్ రావడంలో జైపాల్ రెడ్డి పాత్ర కీలకమని జీవన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ బిల్లు ఆమోదంలో జైపాల్ రెడ్డి పాత్ర కీలకమైందని ఎమ్మెల్యే వినోద్ కుమార్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పార్లమెంట్లో ఆయన పోషించిన వార్త చాలా గొప్పదని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి చెప్పుకొచ్చారు.
దివంగత కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి 83వ జయంతి ఈ సందర్భంగా ఆయన సమాధి వద్ద శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్యేలు వినోద్ కుమార్ మందుల సామేలు సహా కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు.