నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్ మెట్రోలో ఉద్యోగాలకు ఎచ్ఎమ్ఆర్ఎల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏఎమ్ఎస్ ఆఫీసర్, సిగ్నలింగ్ టీమ్, రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్, ట్రాక్స్ టీమ్ లీడర్, ఐటీ ఆఫీసర్ వంటి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. మరి ఈ ఉద్యోగాలు పొందాలంటే కావాల్సిన అర్హతలేంటో తెలుసుకుందామా..?
ఖాళీల వివరాలు..
మొత్తం ఖాళీలు-12
ఏఎమ్ఎస్ ఆఫీసర్ – 1
సిగ్నలింగ్ టీమ్ – 2
రోలింగ్ స్టాక్ టీం లీడర్ – 6
ట్రాక్స్ టీం లీడర్ – 2
ఐటీ ఆఫీసర్ – 1
కావాల్సిన అర్హతులు
1. AMS ఆఫీసర్.. వ్యాపార విశ్లేషకుడిగా, సొల్యూషన్ ఆర్కిటెక్ట్‌గా మంచి అనుభవం, IBM మ్యాక్సిమో సాఫ్ట్‌వేర్‌లో నైపుణ్యం ఉండాలి. అసెట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్‌లో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. దీనికి దరఖాస్తు చేసుకోవాలంటే మీరు ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.
2. సిగ్నలింగ్ టీమ్.. SIG/COM/AFC నిర్వహణలో డిప్లొమా ఇంజనీర్‌గా కనీసం 4 నుంచి 8 సంవత్సరాల అనుభవం, ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్/ కమ్యూనికేషన్లో డిప్లొమా/ గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అయిండాలి.
3. రోలింగ్ స్టాక్ టీం లీడర్.. ఇంజనీర్- మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్‌లలో డిప్లొమా లేదా గ్రాడ్యుయేట్ , ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ మెయింటనెన్స్‌లో 4 నుంచి 8 సంవత్సరాల అనుభవం ఉండాలి. అలాగే సాంకేతికత ఆధారిత రైలు/మెట్రో, పారిశ్రామిక వాతావరణంలో పని చేసే పరిజ్ఞానం ఉండాలి.
4. ట్రాక్స్ టీం లీడర్.. బీఈ/బీటెక్ పూర్తి చేసి నాలుగు సంవత్సరాల అనుభవం లేదా ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వారికి ట్రాక్ నిర్వహణలో.. 4 నుంచి 7 సంవత్సరాల అనుభవం, సివిల్ లేదా మెకానికల్‌లో డిప్లొమా/గ్రాడ్యూయేషన్ పూర్తి చేసి ఉండాలి.
5. ఐటీ ఆఫీసర్.. బీటెక్, ఐటీ/ఎమ్సీఏ/ఐటీ/ ఎమ్సీఏ-ఐటీ పూర్తి చేసి ఉండాలి. బహుళజాతి, సర్వీసెస్ కన్సల్టింగ్ పరిశ్రమలలో 1-2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.