అక్షయ తృతీయకు బంగారం కొనేటప్పుడు ఈ తప్పులని అస్సలు చెయ్యకండి..!

-

అక్షయ తృతీయ నాడు బంగారాన్ని చాలా మంది కొంటూ ఉంటారు. మీరు కూడా ఈ అక్షయ తృతీయ కి బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా వీటిని ఫాలో అవ్వండి అప్పుడు మంచి బంగారాన్ని కొనుగోలు చేయడానికి అవుతుంది. బంగారాన్ని కొనుగోలు చేసే క్రమంలో మీరు మోసపోకుండా ఉంటారు ఈసారి అక్షయ తృతీయ ఏప్రిల్ 22న వచ్చింది. అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొంటె లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది అలానే అంతా శుభం కలుగుతుంది అని అంతా నమ్ముతూ ఉంటారు.

 

అక్షయ తృతీయ రోజున నగలు అమ్మకాలు ఎక్కువ ఉంటాయి బంగారాన్ని కొనేటప్పుడు తప్పకుండా వీటిని ఫాలో అవ్వండి. బంగారు నగలు కొనేటప్పుడు నాణ్యతని చూసుకోవాలి అలానే స్వచ్ఛమైన బంగారం 24 క్యారెట్లు ఉంటుంది. కేవలం ఈ బంగారం తోనే నగలు చేయడం సాధ్యం అయితే బంగారం నగలు తయారు చేసేటప్పుడు ఇతర లోహాలు కలిపి 22 క్యారెట్ నగలు తయారు చేస్తారు చాలావరకు షాపుల్లో 24 క్యారెట్ నగలని అమ్ముతుంటారు కానీ 24 క్యారెట్ నగలు ఉండవు కేవలం 22 క్యారెట్, 18 క్యారెట్ నగలు ఉంటాయి కాబట్టి బంగారాన్ని కొనుగోలు చేసే ముందు స్వచ్ఛత గురించి తప్పక తెలుసుకోవాలి.

హాల్ మార్క్ ఉన్న నగలు కొంటే బంగారం స్వచ్ఛతకి హామీ ఉంటుంది నగలు తయారు చేసే వ్యాపారులు ఆ నగలు ఎంత బంగారం ఉందో టెస్ట్ చేయించి ఆభరణాలపై హాల్ మార్క్ ముద్ర వేయిస్తారు. హాల్ మార్క్ లేని నగలకంటే హాల్ మార్క్ ఉన్న నగలు తీసుకోవాలి అలానే ఆభరణాన్ని బట్టి మేకింగ్ చార్జీలు ఉంటాయి. మూడు నుండి 25% మధ్య ఉంటాయి మేకింగ్ చార్జీలు వేరు మంజూరి వేరు గుర్తుపెట్టుకోండి. బంగారాన్ని కరిగించి ముక్కలు చేసి తయారు చేయడం తో కొంత బంగారం వేస్ట్ అవుతుంది అయితే ఈ వేస్టేజ్ ని కస్టమర్ భరించాల్సి ఉంటుంది అందుకే కస్టమర్ల నుండి ఈ చార్జీలని వసూలు చేస్తారు ఐదు నుండి ఏడు శాతం వరకు ఈ చార్జీలు ఉంటాయి. బంగారాన్ని కొనుగోలు చేసే ముందు ఆరోజు బంగారం ఎంత ఉంది అనేది తెలుసుకుని అప్పుడే కొనుగోలు చేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version